Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దిల్ రాజు మామూలు హిట్ కొట్టలేదు

  • ఇటీవల థియేటర్లకు వచ్చిన 'ఎఫ్ 2'
  • నైజామ్ లో 'ఫిదా' రికార్డుకి దగ్గరగా
  • ఈ ఏడాది ఆరంభంలోనే అదిరిపోయే హిట్      
ఇటు యూత్ కి .. అటు మాస్ కి .. ఫ్యామిలీ ఆడియన్స్ కి తగిన సినిమాలను నిర్మిస్తూ వచ్చే దిల్ రాజు, అప్పుడప్పుడు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలను కూడా నిర్మిస్తూ వస్తున్నారు. నిర్మాతగా ఆయన చాలా సక్సెస్ లను అందుకున్నారు. అయితే ఆ సినిమాల కంటే ఇటీవల థియేటర్లకు వచ్చిన 'ఎఫ్ 2' ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా చాలా తక్కువ సమయంలో 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.

దిల్ రాజు నిర్మించిన 'ఫిదా' నైజామ్ లో 18 కోట్ల వరకూ రాబట్టేసి కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటికే 'ఎఫ్ 2' నైజామ్ లో 15 కోట్లకి పైగా వసూలు చేసేసింది. రేపో మాపో 'ఎఫ్ 2' ఆ రికార్డును క్రాస్ చేసే అవకాశాలు వున్నాయని అంటున్నారు. ఇక నైజామ్ మినహా చాలా ప్రాంతాల్లో ఈ సినిమా వసూళ్లు 'గీత గోవిందం' వసూళ్లను అధిగమించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. మొత్తానికి దిల్ రాజు ఈ ఏడాది ఆరంభంలోనే మరిచిపోలేని హిట్ కొట్టారని ఫిల్మ్ నగర్లో మాట్లాడుకుంటున్నారు. 
dil raju

More Telugu News